సినీ నటుడు చలపతిరావుకు స్వల్పగాయాలు

chalapatirao సినీనటుడు చలపతిరావు గురువారం (ఫిబ్రవరి-15) స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. రామోజీఫిల్మ్‌సిటీలో షూటింగ్ సమయంలో ప్రముఖ సినీ నటుడు చలపతిరావు బస్సు వెనుక నిచ్చెన ఎక్కుతుండగా కింద పడ్డారు. దీంతో చలపతిరావుకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. చలపతిరావు ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని, ఆయనకు చికిత్స అందిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు. చలపతిరావు ఆరోగ్య పరిస్థితిని చిత్ర నిర్మాత, హీరో అల్లరి నరేశ్ వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. అల్లరి నరేష్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Posted in Uncategorized

Latest Updates