సినీ పరిశ్రమలో శ్రీదేవి ఒక దేవకన్య

devaసినీ పరిశ్రమలో ఆమె ఓ దేవకన్య. అతిలోకసుందరిగా ఓ వెలుగువెలిగారు అందాల నటి శ్రీదేవి. నాలుగేళ్ల  ప్రాయంలోనే తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చింది శ్రీదేవి. 1969 లో తునైవన్  సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటిగానే పలు చిత్రాల్లో మురుగన్ గా, కృష్ణుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు శ్రీదేవి.

అనురాగాలు, మూండ్రు ముడిచ్చు సినిమాలలో హీరోయిన్ గా నటించారు. భారతీరాజ దర్శకత్వంలో వచ్చిన  పదునారు వయదినిలే సినిమాతో ఆమెకు హీరోయిన్ గా మంచి గుర్తిం‍పు వచ్చింది. ఈ సినిమా రీమేక్  గానే రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెలుగులో పదహారేళ్ల వయసు సినిమాతో అభిమానుల గుండెల్లో సుస్ధిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ సినిమా షూటింగ్ అప్పుడు శ్రీదేవి వయస్సు 14 ఏళ్లే కావడం విశేషం..

16 ఏళ్ళ వయసు సినిమాతో ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ అందాలతారను స్టార్  హీరోయిన్ గా మార్చిన మూవీ వేటగాడు. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి తరువాత ఏడేళ్లకు ఆయన సరసనే హీరోయిన్ గా నటించి మెప్పించారు. వేటగాడుతో మంచి విజయం అందుకున్న ఎన్టీఆర్, శ్రీదేవి ఆ తర్వాత హిట్ ఫెయిర్ గా నిలిచారు. వరుసగా నాలుగేళ్ల పాటు వెండితెరపై ఈ జంట కనిపిస్తే చాలు అభిమానులకు పండుగే.

ఎన్టీఆర్ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ఎన్నో సినిమాల్లో నటించారు. ANR తో ప్రేమాభిషేకం, బంగారు కానుక, శ్రీరంగనీతులు వంటి సినిమాలు టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. ఇక ఆ జనరేషన్ లో టాప్ హీరోలందరితో నటించారు శ్రీదేవి. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి హీరోలందరితో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు

NTR, ANR తర్వాత తరం హీరోలతో అభినయించారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తోనూ సూపర్ జోడి అనిపించుకున్నారు. చిరంజీవికి జోడిగా రాణీకాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోక సుందరి, SP పరుశురాం వంటి తెలుగు సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా లాంటి సినిమాల్లో నాగార్జునతో.. క్షణ క్షణం సినిమాలో వెంకటేష్ తో నటించారు శ్రీదేవి

ఓవైపు టాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు కొనసాగుతుండగానే…  బాలీవుడ్  లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కూడా తన హవాను కొనసాగించారు. 1975లో జూలీ సినిమాతో బాలీవుడ్  కు పరిచయమైన శ్రీదేవికి హిమ్మత్  వాలా సినిమా తొలి బ్లాక్  బస్టర్  దక్కింది. హిమ్మత్  వాలా తరువాత బాలీవుడ్  స్టార్  హీరోలకు ఆమె హాట్ ఫేవరెట్ గా మారారు. శ్రీదేవి వరుస విజయాలతో ఇండియన్  టాప్ హీరోయిన్ గా ఎదిగారు.

బాలీవుడ్ లో నెంబర్ 1 స్థాయికి ఎదిగిన తర్వాత టాలీవుడ్ లో దూరమయ్యారు. 250 కి పైగా సినిమాల్లో నటించిన ఆమె.. భారతీయ అగ్రనటులందరితోనూ నటించారు. తెలుగులో 85, తమిళంలో 72, మళయాలంలో 26, హిందీలో 71 సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు శ్రీదేవి.

పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రీదేవి. చాలా ఏళ్ల ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అన్నాళ్లకు సిల్వర్ స్ర్కీన్ పై కనపించినా తన అందంలో కానీ, అభినయంతో ఏ మాత్రం ఫాలోయింగ్  ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్  చేసుకున్నారు అతిలోక సుందరి. శ్రీదేవి కెరీర్ లో మామ్ సినిమా చివరిది. జీరో అనే మూవీ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి ఆకస్మిక మరణం అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

 

Posted in Uncategorized

Latest Updates