సిమ్లాలో భారీ వర్షాలు : నదిలో కొట్టుకుపోయిన బస్సు

హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అతి భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదనీటి ప్రవాహంతో బియాజ్ నది పొంగి పొర్లుతోంది. వరద ప్రవాహం ధాటికి లారీలు, బస్సులు కొట్టుకుపోతున్నాయి. ప్రముఖ పర్యాటక స్థలం మనాలీలో బియాజ్ నదిలో పడి ఓ టూరిస్ట్ బస్సు కొట్టుకుపోయింది. పర్యాటకులతో వచ్చిన బస్సులను బియాజ్ నదికి సమీపంలో నిలిపారు డ్రైవర్లు. వర్షాల ధాటికి టూరిస్టులు గుడారాల్లో ఉండిపోయారు.

ఇంతలో వరద ప్రవాహం ఎక్కువై.. నదిలోకి ఒరిగిపోయింది. కళ్లముందే కనుమరుగై పోయిన బస్సును చూసి.. టూరిస్టులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే కులూకి సమీపంలో ఓ ట్రక్ నదిలో పడి కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో అందులో ఎవరైనా ఉన్నారా లేరా అన్నది తెలియాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates