సిమ్ కార్డ్ కి నివాళి : స్మార్ట్ ఫోన్ లో ఐ-సిమ్ విప్లవం

sim cardsఫోన్ అంటే సిమ్ కార్డ్. అది లేకుండా లక్ష రూపాయల ఫోన్ కొన్నా ఉపయోగం లేదు. ఫోన్ మనిషి అయితే.. సిమ్ కార్డ్ గుండె. టెక్నాలజీలో మరో విప్లవం వచ్చింది. సిమ్ కార్డ్ లేని ఫోన్ రాబోతున్నది. మొబైల్ ఫోన్లలో వాడే సిమ్ కార్డ్ కి ప్రత్యామ్నాయంగా ఐ-సిమ్ కనిపెట్టింది ఆర్మ్ టెక్నాలజీస్ సంస్థ. వీటిని 2018 MWC (మొబైల్ వరల్డ్ కాంగ్రెస్) సదస్సులో ప్రదర్శించనుంది. స్మార్ట్ ఫోన్ తయారీ దారులు, నెట్ వర్క్ సంస్థలు రెడీ అంటే.. జస్ట్ ఏడాది కాలంలోనే ఈ టెక్నాలజీ ఇండియాలోకి అందుబాటులోకి రానుంది.

ఐ-సిమ్ ఎలా ఉంటుంది :

స్మార్ట్ ఫోన్ లోని ప్రాసెసర్ తోనే ఇది తయారు అవుతుంది. నెట్ వర్క్ ప్రాసెసర్ కి సంబంధించిన చిప్ లోనే ఐ-సిమ్ ఇన్ స్టాల్ అయ్యి ఉంటుంది. దీని కోసం స్క్వైర్ మిల్లీమీటర్ కంటే తక్కువ స్థలంలోనే దీన్ని తయారు చేశారు. మనం ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత.. ఐ-సిమ్ నెంబర్ నెట్ వర్క్ కంపెనీలకు చెబితే.. వాళ్లు దానికి మొబైల్ నెంబర్ ను లింక్ చేస్తారు.

ఈ విధానం వల్ల ప్రస్తుతం ఉన్న సిమ్ కార్డ్ అవసరం ఉండదు. మొబైల్ లో ఈ స్థలం మిగులుతుంది. నెట్ వర్క్ కంపెనీలకు కూడా సిమ్ కార్డ్ ఖర్చు తగ్గిపోతుంది. దీనికితోడు ప్రస్తుతం సిమ్ కార్డ్ స్లాట్ కోసం ఉపయోగిస్తున్న స్పేస్ లో మరికొన్ని ఆప్షన్స్ తో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటానికి మొబైల్ తయారీ కంపెనీలకు అవకాశం కూడా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు, నెట్ వర్క్ కంపెనీలు రెడీగా ఉంటే.. 2018 చివరి నాటికి ఐ-సిమ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. ఈ టెక్నాలజీతో మెరుగైన వాయిస్ క్లారిటీ ఉంటుందని ఆర్మ్ కంపెనీ వెల్లడించింది.

Posted in Uncategorized

Latest Updates