సిరియాపై అమెరికా మెరుపు దాడులు.. 40 మంది మృతి

SYRIAసిరియాపై అమెరికా మెరుపు దాడులకు దిగింది. సిరియా రాజధాని డమాస్కస్ సమీపంలో జరిగిన రసాయనిక దాడిలో 40 మంది చనిపోయారు. దీంతో శనివారం (ఏప్రిల్-14) ట్విట్టర్ లో స్పందించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. సిరియాలో దాడులు కొనసాగుతున్నాయని ప్రకటించారు. అమెరికా, బ్రిటీష్, ఫ్రెంచ్ సంయుక్తంగా ఈ దాడులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ రసాయనిక దాడుల వెనుక రష్యా హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలో సిరియన్ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌పై చర్యలు చేపట్టినట్లు చెప్పారు ట్రంప్.

Posted in Uncategorized

Latest Updates