సిరియాలో మారణ హోమం: 200మంది హతం

syria
సిరియాలో మారణ హోమం జరిగింది. వైమానిక దాడుల్లో200 మంది మృతిచెందారు. మరో300 మంది గాయపడ్డారు. డమస్కస్‌కు సమీపంలో ఉన్న ఈస్ట్రన్ గౌటా ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సిరియా ప్రభుత్వ దళాలు ఈ దాడులు గత కొన్నేళ్లుగా తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు గౌటా ప్రాంతంపై సిరియన్‌ ఆర్మీ  ఆది, సోమవారాల్లో బాంబుల వర్షం కురిపించింది. దాడుల్లో చనిపోయిన వారిలో 57 మందికిపైగా చిన్నారులు ఉన్నారు.

కేవలం సోమవారం(19) దాడుల్లోనే 127 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్య ఎక్కువగా ఉండటం… సరిపడా పడకలు లేకపోవడంతో చికిత్స అందించడం సాధ్యం కావడం లేదంటున్నారు డాక్టర్లు. డమాస్కస్‌ శివార్లలో 2015 తర్వాత జరిగిన అతి పెద్ద దాడులు ఇవేనని  మానవ హక్కుల పరిశీలన సంస్థ చీఫ్‌ రమి అబ్దెల్‌ రెహమాన్‌ తెలిపారు. గౌటాలో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పిందని చెప్పారు. దాదాపు నాలుగు లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతంలో మరోసారి భారీ దాడికి అవకాశం ఉందని అల్‌-వతన్‌ పత్రిక తెలిపింది.

తూర్పు గౌటా ప్రాంతం 2012 నుంచి రెండు ఉగ్రవాదసంస్థల ఆధీనంలోనే ఉంది. డమాస్కస్‌ శివారు ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ సైన్యాన్ని పంపించారు. దీంతో పలు పట్టణాలపై సైన్యం విమానాలతో దాడులు చేపట్టింది.

Posted in Uncategorized

Latest Updates