సిరియా మారణహోమం : కెమికల్స్ దాడుల్లో వందల మంది చిన్నారులు మృతి

syria-attackసిరియాలో మారణహోమం కొనసాగుతుంది. ప్రభుత్వం – రెబల్స్ మధ్య రోజురోజుకి దాడులు తీవ్రం అవుతున్నాయి. లేటెస్ట్ గా సినియాలోని తూర్పుభాగంలోని గౌటాపై ప్రభుత్వ దళాలు విచుకుపడ్డాయి. రెబల్స్ టార్గెట్ గా కెమికల్స్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అన్నెంపెన్నెం ఎరుగని 100 మందికి పైగా చిన్నారులు చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది చిన్నారుల ఆచూకీ లభించలేదు. ఆస్పత్రులన్నీ చిన్నారులతో నిండిపోయాయి. చికిత్స అందించటానికి కూడా సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు వైద్యులు. ప్రభుత్వ దళాలు కెమికల్ దాడులకి దిగటంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు బలైపోతున్నారని.. వెంటనే అంతర్యుద్దాన్ని ఆపాలని డిమాండ్ చేశాయి ప్రపంచదేశాలు.

రసాయన దాడులు చేయలేదని ప్రకటించాయి సిరియా ప్రభుత్వ దళాలు. చర్చలు విఫలం కావటంతో వాయుసేన ఆధ్వర్యంలో దాడులకి దిగినట్లు తెలిపాయి. మరోవైపు సినియాలో పరిస్థితులపై అమెరికా సీరియస్ అయ్యింది. సిరియా ఎయిర్ బేస్ లో మిస్సైల్ దాడులు చేసింది.

Posted in Uncategorized

Latest Updates