సిరిసిల్లను సిరిశాలగా మారుస్తాం : కేటీఆర్

సిరిసిల్లను…సిరిశాలగా మారుస్తామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం కావాలన్నారు.

సిరిసిల్ల నేతన్నల అభివృద్ది కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి…అమలు చేస్తామన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా బుధవారం సిరిసిల్ల టూర్ కు వెళ్లిన కేటీఆర్ కు ప్రజలు, టీఆర్ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రాజకీయ జన్మ ఇచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకుంటానన్నారు. సిరిసిల్లలో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు సీఎం కేసీఆర్‌ వైపే ఉంటారని కేటీఆర్‌ చెప్పారు. త్వరలో సిరిసిల్లకు రైలు వస్తుందని, లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని భరోసా ఇచ్చారు. చేనేత కార్మికులకు మరింత చేయూతనిస్తామని, అపరెల్‌ పార్క్‌లో 10వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates