సిరిసిల్లలో కేటీఆర్ భారీ విక్టరీ

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కేటీఆర్ భారీ మెజార్టీ తో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్తి మహేంధర్ రెడ్డిపై 89,009 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004 నుంచి కేటీఆర్ వరుస విజయాలను నమోదు చేశారు. ఈ సారి తనకు ఇంతటి భారీ మెజార్టీ ని కట్టబెట్టిన సిరిసిల్లా ప్రజలకు ట్విట్టర్ లో కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ముందుగా తనకు 88,886 ఓట్ల మెజార్టీ చ్చిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ తరువాత తనకు 89,009 మెజార్టీ వచ్చినట్లు తెలిసిందని మరోసారి తెలిపారు. ఇప్పటివరకు ఇదే నాకు అత్యధిక మెజారిటీ అని.. నాకు చేతనైనంతగా నా సిరిసిల్లా ప్రజలకు సేవచేస్తానని ట్వీట్ చేశారు.

 

ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు..? కింద లింక్ క్లిక్ చేయండి

Telangana Assembly Election Results 2018 Live Updates

Posted in Uncategorized

Latest Updates