సిరిసిల్లలో కలకలం సృష్టించిన డిటోనేటర్లు

సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో శనివారం పేలుడు కలకలం సృష్టించింది. మానసిక స్థితి సరిగాలేని ఓ మహిళ చెట్ల పొదలకు నిప్పు పెట్టడంతో…అక్కడే ఉన్న డిటోనేటర్లు పేలి మహిళకు గాయలయ్యాయి. అయితే కొంతమంది బండరాళ్లు పేల్చేందుకు తీసుకొచ్చిన డిటోనేటర్లను…అక్కడ వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. గాయపడిన మహిళను హాస్పిటల్ కు తరలించిన పోలీసులు… అక్కడ వదిలేసిన డిటోనేటర్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates