సిరిసిల్ల నియోజకవర్గం రాష్ట్రంలోనే నంబర్ 1: కేటీఆర్

kyr-mini
కలిసికట్టుగా పనిచేసి బంగారు తెలంగాణ సాకారం చేసుకున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లను రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మంగళవారం(ఏప్రిల్-10) పర్యటించిన మంత్రి కేటీఆర్…తిరుగులేని శక్తిగా TRS నిలుస్తోందన్నారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో చిట్ చాట్ చేశారు. తర్వాత గౌడ సామాజిక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో మూడు పార్టీలకు చెందిన మున్సిపల్ ఫ్లోరు లీడర్లు TRS లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Posted in Uncategorized

Latest Updates