సిరీస్‌ మనదే : వెస్టిండీస్‌ పై భారత్ గ్రేట్ విక్టరీ

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌ తో జరిగిన రెండో టెస్ట్‌ లో భారత్ గ్రేట్ విక్టరీ సాధించింది. 10 వికెట్ల తేడాతో మ్యాచ్ ను మూడు రోజుల్లోనే ప్యాక్ అప్ చేసింది. 72 రన్స్ టార్గెట్ ని వికెట్ నష్టపోకుండా ఛేదించి, రెండు టెస్ట్‌ ల సిరీస్‌ ను 2-0తో ఎగరేసుకుపోయింది. సొంతగడ్డపై కోహ్లి సేనకు ఇది వరుసగా పదో టెస్ట్ సిరీస్ విజయం కావడం విశేషం.

ఫస్ట్ ఇన్నింగ్స్‌ లో 367 రన్స్ చేసి 56 రన్స్ లీడ్ సాధించిన టీమిండియా.. సెకండ్ ఇన్నింగ్స్‌ లో వెస్టిండీస్‌ ను 127 రన్స్ కే కట్టడి చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌ లో 6 వికెట్లు తీసిన ఉమేష్ యాదవ్.. సెకండ్ ఇన్నింగ్స్‌ లో 4 వికెట్లు తీశాడు. టెస్ట్ కెరీర్‌ లో పది వికెట్లు తీయడం ఉమేష్‌ కు ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. తర్వాత తక్కువ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు పృథ్వీ షా, KL రాహుల్ ఆడుతూ పాడుతూ విజయం సాధించి పెట్టారు. పృథ్వీ 33, రాహుల్ 33 రన్సక తో నాటౌట్‌ గా నిలిచారు. ఫస్ట్ టెస్ట్‌ లో ఇన్నింగ్స్ 272 రన్స్ తో భారత క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధించిన కోహ్లి సేన.. రెండో టెస్ట్‌ లో 10 వికెట్లతో గెలవడం ఓ రికార్డే.

Posted in Uncategorized

Latest Updates