సిరీస్ కైవసం : పాతికేళ్ల చరిత్ర తిరగరాసిన భారత్

IND25 సంవత్సరాల చరిత్రను భారత్ తిరగరాసింది. 1992 నుంచి ఆరు సార్లు పర్యటించినా ఒక్క వన్డే సిరీస్‌లో కూడా విజేతగా నిలవలేకపోయిన టీమిండియా.. ఈసారి కోహ్లి కెప్టెన్సీలో రికార్డు సృష్టించింది . తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకొని సత్తా చాటింది. రెండేళ్ల క్రితం సొంతగడ్డపై ఎదురైన వన్డే సిరీస్‌ పరాజయానికి కూడా సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు వన్డేల్లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. ఆరు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 4–1తో గెలుచుకుంది. మంగళవారం (ఫిబ్రవరి-13) పోర్ట్‌ ఎలిజబెత్‌ లో జరిగిన ఐదో వన్డేలో భారత్‌ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రోహిత్‌ శర్మ (126 బంతుల్లో 115; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) వన్డే కెరీర్‌లో 17వ సెంచరీతో సత్తా చాటాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. హషీం ఆమ్లా (92 బంతుల్లో 71; 5 ఫోర్లు) ఒక్కడే పోరాడగలిగాడు.  సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్‌ ICC ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని పటిష్టం చేసుకుంది.  ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 16న) సెంచూరియన్‌లో జరుగనుంది.

HISTORY created!#TeamIndia's first bilateral ODI series win in South Africa! An unassailable 4-1 lead now with just one more to play. #SAvIND pic.twitter.com/qrJerFGZXc
— BCCI (@BCCI) February 13, 2018

Posted in Uncategorized

Latest Updates