సిరీస్ పై కన్నేసిన భారత్ : ఫైనల్ కాని ఫైనల్ మ్యాచ్

INDకోహ్లీ సేన మరో సిరీస్ పై కన్నేసింది. ఇంగ్లాండ్‌ గడ్డపై ఫస్ట్ టీ20లో గ్రాండ్ విక్టరీ సాధించిన టీమిండియా.. శుక్రవారం (జూలై-6) జరిగే రెండో టీ20లో గెలిచి, సిరీస్‌ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్‌ శుక్రవారం జరుగనుంది. కార్డిఫ్‌ వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్‌ జూలై 6వ తేదీ శుక్రవారం రాత్రి 10గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ లో టీమిండియా గెలిచినట్లయితే ఇంకా మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

ఫస్ట్ టీ 20లో కుల్దీప్‌ యాదవ్‌ విజృంభణకు.. KL రాహుల్‌ చెలరేగి ఆడటంతో భారత్‌ ఈజీగా గెలిచింది. గతేడాది నవంబర్‌ లో న్యూజిలాండ్‌ తో జరిగిన మూడు టీ20 సిరీస్‌ ను 2-1 తేడాతో గెలిచిన భారత్‌.. ఆపై ఇప్పటివరకూ పొట్టి ఫార్మాట్‌ లో సిరీస్‌ ను కోల్పోలేదు. న్యూజిలాండ్‌ పై సిరీస్‌ సాధించిన తర్వాత.. శ్రీలంక, సౌతాఫ్రికాపై సైతం సిరీస్‌ లను చేజిక్కించుకుంది. ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన నిదాహాస్‌ ముక్కోణపు టీ20 సిరీస్‌ ను కూడా గెలవగా, ఇటీవల ఐర్లాండ్‌ తో రెండు టీ20ల సిరీస్‌ ను కూడా క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ క‍్రమంలోనే ఇంగ్లండ్‌ తో శుక్రవారం మ్యాచ్‌ లో టీమిండియా గెలిస్తే వరుసగా ఆరో టీ20 సిరీస్‌ ను సాధించినట్లవుతుంది.

సొంత గడ్డపై సత్తాచాటేందుకు ఇంగ్లండ్‌ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ప్రధానంగా ఫస్ట్ టీ20లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్ టీమిండియా.

Posted in Uncategorized

Latest Updates