సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు కేటీఆర్ పూజలు

కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ లో SPM గ్రౌండ్ దగ్గర కాగజ్ నగర్ మున్సిపాలిటికి 10 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్ . సిర్పూర్ పేపర్ మిల్లు పున: ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.  తర్వాత కాగజ్ నగర్-చింతగూడ మధ్య నాలుగున్నర కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాల తర్వాత SPM గ్రౌండ్ లో భారీ బహిరంగసభలో పాల్గొంటారు మంత్రులు.

కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ లో పర్యటిస్తున్నమంత్రి కేటీఆర్… ఆయన వెంట మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి ఉన్నారు. కాగజ్ నగర్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్న నేతలు.. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ దగ్గర మిషన్ భగీరథ వాటర్ ను.. కాగజ్ నగర్ పట్టణానికి విడుదల చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఆ తర్వాత కాగజ్ నగర్ మున్సిపాలిటీకి కేటాయించిన 480 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Posted in Uncategorized

Latest Updates