సిలిండర్ బాధ లేదు : 20 జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ పైప్ లైన్

gasరాష్ట్రంలోని 20 జిల్లాల్లో గొట్టాల ద్వారా ప్రతి ఇంటికీ గ్యాస్ సరఫరా చేయాలని పెట్రోలియం, సహజవాయువుల నియంత్రణ బోర్డు(PNGRB) నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, భద్రాద్రి-కొత్తగూడెం, జగిత్యాల, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మెదక్, సిద్దిపేట‌, మేడ్చ‌ల్-మల్కాజ్ గిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, యాదాద్రి- భువ‌న‌గిరి జిల్లాల‌ను ఎంపిక చేసింది. 11 వేల 900 కిలోమీట‌ర్ల మేర కొత్త పైప్ లైన్ నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. అక్టోబర్ లో  ఈ జిల్లాల గ్యాస్ స‌ర‌ఫ‌రాకు సంబంధించిన బిడ్ కు టెండ‌ర్ల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తి అయితే… 75 శాతం ప్రాంతంలో పైప్ లైనులు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని 20 జిల్లాలను ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా కార్యక్రమానికి ఎంపిక చేయడం సంతోఫకర పరిణామమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఎస్.కె.జోషి తెలిపారు. PNGRB ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తుందన్నారు.మరోవైపు ఏపీలోని మూడు జిల్లాలకు కూడా గొట్టాల ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేందుకు బోర్డు నిర్ణయించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. దేశంలోని కోటి ఇళ్లకు ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా చేయాలన్నది కేంద్రప్రభుత్వ లక్ష్యమని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అశీష్ చటర్జీ తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates