సివిల్స్ టాప‌ర్‌కు ఎట్ హోం ఆహ్వానం

సివిల్స్‌లో నేషనల్‌ టాపర్‌గా నిలిచిన  మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్‌కు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం అందింది. భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ పిలుపు తో 2018 ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు డిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్‌ హోమ్‌కు హాజరు కావాలంటూ దురిశెట్టి అనుదీప్‌కు లేఖను పంపారు. న్యూఢిల్లీలోని రాష్ట్ర పతి భవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌ కార్యాలయంలో రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌తో ఎట్‌ హోమ్‌లో పాల్గొనాలని సూచించారు. వెంట ఆహ్వాన కార్డుతో పాటు ఫోటో గుర్తింపు కార్డు తీసుకొని రావాలని సూచించారు.

Posted in Uncategorized

Latest Updates