సివిల్స్ మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయ్..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ( UPSC) సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్ష 2018 ఫలితాలు రిలీజ్ అయ్యాయి.  ఫలితాలను అధికారిక వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది UPSC. మెయిన్స్ పరీక్షలు 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించారు.

కమిషన్‌ విడుదల చేసిన ఫలితాలలో 1994 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in వెబ్‌ సైట్ల లో ఫలితాలను తెలుసుకోవచ్చని సూచించింది.

 

Posted in Uncategorized

Latest Updates