సీఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షోకాజ్‌ నోటీసులు

ఢిల్లీ: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది సుప్రీంకోర్టు. ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ సిద్దిపేటకు చెందిన శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ(సెప్టెంబర్ 28) విచారణ చేపట్టింది.

రాష్ట్రంలో ఓటరు జాబితా సరిదిద్దకముందే ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే ఓటింగ్ పై తీవ్రప్రభావం పడుతుందని పిటిషనర్ కోర్టుకు చెప్పారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా… రాష్ట్రంలో 2018, జనవరి1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని మాత్రమే ఓటర్లుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో సుమారు 20లక్షల మంది యువత ఓటుహక్కు కోల్పోయే ప్రమాదముందని సుప్రీంకోర్టుకు వివరించారు శశాంక్‌రెడ్డి. ఎన్నికలు సరైన సమయంలో జరిగితే 2019, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు కూడా ఓటేసే అవకాశం ఉంటుందని, ముందస్తు వల్ల వారంతా ఓటేసే అవకాశం కోల్పోతారని చెప్పారు.

ఈ పిటిషన్ ను విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు… వారంరోజుల్లోగా స్పందించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

Posted in Uncategorized

Latest Updates