సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. డిసెంబర్ -13న రాజ్ భవన్ లో కేసీఆర్ తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్ తో పాటు మహముద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం తర్వాత సభికులకు సీఎం కేసీఆర్ మర్వాదపూర్వకంగా నమస్కారం చేశారు.

అంత:కరణ శుద్ధితో..

కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు అనే నేను…  శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతాననీ.. భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతాననీ..  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో.. అంత:కరణశుద్ధితో నిర్వహిస్తాననీ… భయం గానీ.. పక్షపాతం గానీ.. రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి.. ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు అనే నేను.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా .. నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన.. ఏ విషయాన్ని.. నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప.. ప్రత్యక్షంగా గానీ.. పరోక్షంగా గానీ.. ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియపరచననీ.. లేదా వెల్లడించననీ.. దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.” అని కేసీఆర్ ప్రమాణం చేశారు.

గవర్నర్ నరసింహన్.. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Posted in Uncategorized

Latest Updates