సీఎంలకు నాగబాబు డిమాండ్ : రాముడిపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి

nagababu-rama-kathiహిందువుల ఆరాధ్యదైవం రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. క్రైస్తవులకు బైబిల్‌, ముస్లింలకు ఖురాన్‌ ఎలాగో హిందువులకు కూడా రామాయణం, మహాభారతం అలాంటివే అన్నారు నాగబాబు. ఏ మతాన్ని అయినా కించపరుస్తూ.. ఎవరు మాట్లాడినా తప్పేనన్నారు. రామాయణం ఒక పుస్తకం కాదని, కోట్లాది హిందువులు ఆరాధించే చరిత్ర అన్నారు. మతపరమైన చర్చలను ఎవరూ ప్రోత్సహించవద్దని నాగబాబు కోరారు.

నాస్తికత్వం పేరుతో హిందువుల జోలికి వస్తే శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. హిందువుల మనోభావాలను కించపరిచిన ఆ నీచుడిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నాగబాబు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంలో స్పందించి.. చర్యలు తీసుకోవాలని కోారు. ఇలాంటి వ్యక్తిని ఉపేక్షిస్తే.. చట్టాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. లేకపోతే చారిత్రాత్మక తప్పు చేసిన వారవుతారని నాగబాబు అన్నారు. హిందూ మతంపై పథకం ప్రకారం దాడి జరుగుతోందన్నారు. పోలీసులు, న్యాయవ్యవస్థ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటున్నారు.

ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. రాముడి ఇష్యూ వచ్చిన తర్వాత.. కత్తి మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అంటూ తప్పుడు వార్తలు ప్రచురిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తి చూపు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వైపే ఉందని.. కర్నాటక ఎన్నికల సమయంలో టీడీపీ బృందంతో కలిసి వెళ్లాడని చెప్పారు. హిందూ మత విశ్వాసాలపైనే నమ్మకం లేని అలాంటి వ్యక్తిని.. పార్టీలో చేర్చుకోవటం అనేది ఉండదని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.

Posted in Uncategorized

Latest Updates