సీఎంల ఆస్తుల ర్యాంకులు : చంద్రబాబు ఫస్ట్..కేసీఆర్ ఫోర్త్

kcrదేశంలో ఉన్న 31 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌. ఇందులో దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది కోటీశ్వరులేనని ( ADR) ఓ నివేదిక విడుదల చేసింది. వీరిలో ఏపీ సీఎం చంద్రబాబు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే బాగా రిచ్ సీఎంగా నిలిచినట్లు తెలిపింది . అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ రూ.48 కోట్లతో మూడోస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగోస్థానంలో నిలిచారు. ఆయనకు రూ.15.51 కోట్లున్నట్లు (కేసీఆర్‌ ఆస్తులు, ఆయన సతీమణి శోభ ఆస్తులు కలిపి) వెల్లడయింది. దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉందని తెలిపింది ADR. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ADR, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌(NLW) లు ఈ నివేదికను రూపొందించాయి.
దేశంలోని అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్‌ సర్కార్‌ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో నిలిచారు.

Posted in Uncategorized

Latest Updates