సీఎం ఇంటి పక్కనే : ఉండవల్లి రైతులతో సమావేశమైన పవన్

ఏపీ అమరావతి సమీపంలోని ….ఉండవల్లి రైతులతో భేటీ అయ్యారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. సీఎం చంద్రబాబు నివాసానికి 500 మీటర్ల దూరంలోనే సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. భూములు ఇవ్వలేదనే కారణంతో అధికారులు బెదిరిస్తున్నారని పవన్ కు చెప్పారు రైతులు. రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు పవన్. ఇంతవరకు ఎందుకు నిర్మాణాలు చేయలేదన్నారు . రాజధాని పేరుతో సింగపూర్ శక్తులకు భూములు కట్టుబెడుతున్నారని విమర్శించారు పవన్. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదన్న ఆయన… బలవంతపు భూసేకణను ఒప్పుకోమన్నారు. అభివృద్ధి కోసమే గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చానని చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates