సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు: కేటీఆర్

ktr
సీఎం కేసీఆర్ తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని తెలిపారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంతటి పెద్ద లక్ష్యాన్నయినా కేసీఆర్  సాకారం చేసి చూపుతున్నారన్నారు. పాడి, పంట బాగుంటేనే రైతుల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పంట కోసం రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని, పాడి కోసం త్వరలో గెదేలను పంపిణీ చేయాలని నిర్ణయించామని చెప్పారు. భవిష్యత్‌లో తెలంగాణలో యాదవులు ధనవంతులు కాబోతున్నారన్నారు. గొర్రెలను పంపిణీ చేసిన తర్వాత వాటి సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తుందన్నారు. గొర్రెల పంపిణీ కోసం గతేడాది సీఎం కేసీఆర్ రూ. 5 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. ఈ ఏడాది గొర్రెల పంపిణీ కోసం ఇంకా ఎక్కువనే నిధులు ఇస్తామన్నారు. విదేశాలకు మాంసం పంపిణీ చేసే స్థాయికి ఎదగాలన్నారు. గొర్రెల పంపిణీ పథకంపై సీఎం  ఎంతో లోతుగా ఆలోచించారని, గ్రాసం, వైద్యం, బీమా తదితర అంశాలన్నింటిపై ఆలోచించారన్నారు. రైతుబంధు, రైతుబీమాతో అన్నదాతకు అండగా నిలుస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మత్స్యకారులను ఆదుకునేందుకు రూ. వెయ్యి కోట్లతో చేపల పెంపకం చేపట్టామని తెలిపారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates