సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన వాయిదా

ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం టూర్ వాయిదాపడింది. శనివారం అధికారులతో ఇరిగేషన్ శాఖ అధికారులతో రివ్యూ చేసిన సీఎం… నిర్మాణంలో ఉన్న వాటర్ ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తిచేయాలని డెడ్ లైన్ పెట్టారు. రేపు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఐతే.. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమం వాయిదాపడింది. తుపాను ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు పడుతున్న కారణంగా.. సీఎం కాళేశ్వరం సందర్శన కార్యక్రమం వాయిదా పడినట్టు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు కాళేశ్వరం వెళ్తారన్నది త్వరలోనే నిర్ణయిస్తారని తెలిపింది.

Posted in Uncategorized

Latest Updates