సీఎం కేసీఆర్ కు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బహిరంగ లేఖ

 సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన.. ఆర్డినెన్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు లేఖ లో తెలిపారు. బీసీ జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వాలని… పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్నారు ఉత్తమ్.  బీసీ జనగణన చేయాలన్న హైకోర్టు ఆదేశాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి నమోదు చేసుకునేలా చూడాలని తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates