సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం : TMU

TMURTC కార్మికులకు 16 శాతం IR ప్రకటించడపైం సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది TMU. ఈ సందర్భంగా సమ్మె నోటీసును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి ఇవ్వడానికి సీఎం కేసీఆర్ ఒప్పుకున్నట్లు మంత్రి ఈటల రాజేంద‌ర్‌ ప్రకటించారు. ఈసందర్భంగా స్పందించిన టీఎంయూ నాయకులు.. ఐఆర్ 16 శాతం ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. కమిటీ ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలన్నారు.

ఆర్టీసీ సమస్యలపై సానుకూలంగా ఉన్నందకు కృతజ్ఞతలు తెలిపిన అశ్వత్థామరెడ్డి…. త్వరలో ఫిట్మెంట్ కార్మికులకు సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. కొన్ని సంఘాలు ఆర్టీసీ విభజనకు ప్రయత్నాలు చేస్తున్నాయని..అది కార్మికులకు నష్టం వాటిల్లుతుందన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates