సీఎం క్రిస్మస్ విందు: నగరంలో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో ఇవాళ(శుక్రవారం) పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్.. క్రిస్మస్ సందర్భంగా విందు ఇవ్వనుండటంతో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అబిడ్స్ నుంచి వచ్చే వెహికల్స్ ను బాబు జగజ్జీవన్ రామ్(బీజేఆర్) స్టాచ్యూ  వైపు రానీయకుండా ఎస్ బీఐ గన్ ఫౌండ్రీ మీదుగా చాపెల్ రోడ్ వైపు మళ్లించనున్నారు.

ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్ స్టాచ్యూ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి,చాపెల్ రోడ్ వైపు మళ్లించనున్నారు. ఓల్డ్‌  ఎమ్మెల్యే  క్వార్టర్స్‌  వైపు నుంచి  వచ్చే వాహనాలను  బషీర్‌బాగ్‌ జంక్షన్ దగ్గర లిబర్టీ  వైపు మళ్లిస్తారు. మరోవైపు ఇవాళ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. దీంతో ఆయన ప్రయాణించే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates