సీఎం యోగి నిర్ణయం: ప్రయాగ్‌రాజ్‌గా అలహాబాద్

yogi adityanathఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్…ఏం చేసినా సంచలనమే. యూపీ సీఎంగా అధికారం చేపట్టిన దగ్గర నుంచి  ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయం సంచలనమే సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు సీఎం యోగి. 2019 కుంభమేళకు ముందే అలహాబాద్ పేరును మార్చాలని భావిస్తున్నారు. పవిత్రమైన కుంభమేళా జరిగే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలని భావిస్తున్నారు. ఈ వార్తలపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ప్రభుత్వం పేరు మార్చాలని నిర్ణయించుకుందని చెప్పారు.

అలహాబాద్ దగ్గర పవిత్ర నదులైన గంగ, యమున, సరస్వతి కలుస్తాయి. ఈ ప్రాంతాన్ని పురాతన కాలం నుంచి ప్రయాగ్‌గా పిలుస్తున్నారని తెలిపారు. పన్నెండేళ్లకు ఓసారి జరిగే కుంభమేళాలో ఎంతోమంది భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు. 2019లో కుంభమేళా జరగనుంది. గతంలో చాలామంది అఖారాలు, సాధువులు యోగిని కలిసి అలహాబాద్ పేరును మార్చాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీలో కుంభమేళా ప్రారంభమవుతుంది. ఆలోగానే అలహాబాద్ పేరును మార్చనున్నారు.

Posted in Uncategorized

Latest Updates