సీఎం రమేష్ ఇంట్లో ముగిసిన IT దాడులు: దొరికినవి రూ.3.53లక్షలు

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో ఐటీ దాడులు అర్థరాత్రి ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబర్ 65లోని సీఎం రమేష్ ఇంట్లోని లాకర్లతో పాటు..బ్యాంకు అకౌంట్లను పరిశీలించారు. సీఎం రమేష్ ఇంట్లో మొత్తం 3 లక్షల 53వేల రూపాయలు ఉన్నాయని నిర్థారించింది ఆదాయపు పన్నుశాఖ.

హైదరాబాద్, కడప ప్రాంతాల్లో సీఎం రమేష్ నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో ఏకకాలంలో60 మంది అధికారులు  దాడులు నిర్వహించారు ఐటీ అధికారులు. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ కంపెనీలతో పాటు..రిత్విక్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని ఇంటిలో ఓ ఐటీ బృందం దాడులు పూర్తయ్యాయి. సాగర్ సొసైటీలోని రిత్విక్ కంపెనీలో మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. దాడుల తర్వాత మీడియాతో మాట్లాడిన రమేష్ …రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే మోడీ ప్రభుత్వం ఈ ఐటీ దాడులు నిర్వహించి.. భయానక వాతావరణం సృష్టిస్తోందంటున్నారు.

ఐటీ దాడుల్లో భాగంగా సీఎం రమేష్ ఇంట్లోని లాకర్లను తెరిచారు. సోదాల్లో  2వేల రూపాయల నోట్లు 111, ఐదొందల రూపాయల నోట్లు 243, రెండొందల రూపాయల నోటు ఒకటి, వంద రూపాయల నోట్లు వంద లభించాయని ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్టులో ఉంది. దాడుల్లో దొరికిందేమీ లేదని.. తమ అంతు చూస్తామంటూ బెదిరించిమరీ  బీజేపీ నేతలు ఈ దాడులు చేయిస్తున్నారని, అంత ఈజీగా ఈ విషయాన్ని వదిలేయనని అన్నారు.

నెలక్రితం కూడా తన సంస్థలపై జీఎస్టీ రైడ్స్ చేశారని..మళ్లీ ఇప్పుడు ఐటీ దాడులతో తమను బెదిరించాలని కేంద్రం ప్రయత్నిస్తోందంటున్నారు సీఎం రమేష్. ఏపీ విభజన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నందుకే తనపై కేంద్రం కక్షగట్టిందని.. ఎన్ని దాడులు చేసినా బెదిరేదే లేదన్నారు. కరడుగట్టిన తెలుగుదేశంవాదులమని.. పరోక్షంగా బీజేపీలోకికి రమ్మని బెదిరిస్తున్నారని..ఇవాళ మీడియా సమావేశంలో పూర్తి వివరాలు చెప్తానంటున్నారు సీఎం రమేష్.

Posted in Uncategorized

Latest Updates