సీఎం రాతపూర్వక క్షమాపణ చెప్పాల్సిందే… IAS అధికారుల డిమాండ్

aniఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఐఏఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సోమవారం(ఫిబ్రవరి-26) నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఐఏఎస్ అధికారులు నల్ల రిబ్బన్లు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షూ ప్రకాశ్‌పై ఆప్ ఎమ్మెల్యేల దాడిని ఖండించారు. ఇందుకు సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. IAS అధికారులకు రాతపూర్వక క్షమాపణ చెప్పాలంటూ IASల ఫోరం సెక్రెటరీ పూజ జోషి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోవడం కుట్రలో భాగమేనని అనిపిస్తోందన్నారు.

ప్రచార ప్రకటనలకు సంబంధించి మాట్లాడాలని అర్థరాత్రి పిలిపించి తనపై దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి (CS) అన్షు ప్రకాశ్‌ ఆరోపించారు. అయితే, అన్షు చేసిన ఆరోపణలను కేజ్రీవాల్‌, ఆయన మంత్రి వర్గం ఖండించింది. అయితే.. అన్షుపై దాడి నిజంగానే జరిగిందని… ఆయన కింది పెదవి కమిలిపోయిందని డాక్టర్లు స్పష్టం చేశారు.

Posted in Uncategorized

Latest Updates