సీఎస్ కేసు విచారణ : సీఎం కేజ్రీవాల్ ఇంటిని ముట్టడించిన పోలీసులు

Arvind ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇంటిని ముట్టడించారు పోలీసులు. 100 పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీ సీఎస్ అన్షు ప్రకాష్‌పై దాడి విషయంలో విచారణ కోసం వచ్చిన అధికారులు.. కేజ్రీవాల్ ఇంట్లోని సీసీ కెమెరా ఫుటేజీ సేకరించనున్నారు. ఈ క్రమంలోనే భారీ ఎత్తున ఆమ్ ఆద్మీ కార్యకర్తలు తరలివస్తారనే సమాచారంతో.. సీఎం కేజ్రీవాల్ ఇంటిని ముందుగానే ముట్టడించారు పోలీసులు.

ఇంటి నుంచి 25 సీసీ కెమెరాలకు సంబంధించిన ఫీడ్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. దీనిపై పోలీసులు వివరణ ఇవ్వటం లేదు. సీఎంను ప్రశ్నించలేదని మాత్రమే చెబుతున్నారు. ఇంట్లో పోలీసులు చేసిన రాద్దాంతంపై కేజ్రీవాల్ స్పందించారు.

తన ఇంట్లో సోదాలు చేయడం కాదు.. పోలీసులకు దమ్ముంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను.. లోయా కేసు విషయంలో ప్రశ్నించాలని సవాల్ విసిరారు. మా పార్టీని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘సీఎం ఇంటిని పోలీసులు ఆక్రమించారు. అనుమతి లేకుండానే ప్రవేశించారు. ఢిల్లీ పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రజాస్వామ్యంలో కనీస మర్యాద అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులున్నాయి. పేదలకోసం, ఒక మంచి సమాజం కోసం అలుపెరగకుండా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఇంత దారుణంగా అవమానిస్తారా? అంటూ ఢిల్లీ ప్రభుత్వ అధికార ప్రతినిధి అరుణోదయ్ ట్వీట్ చేశారు.

Posted in Uncategorized

Latest Updates