సీఐ సుబోధ్ హత్య కేసులో కీలక మలుపు.. జవాను పై అనుమానం

 గో రక్షకుల చేతిలో సీఐ సుబోధ్ కుమార్ చంపబడ్డాడనుకున్న కేసు కీలక మలుపు తిరిగింది. ఉత్తర్ ప్రదేశ్.. బులంద్ షహర్ లో జరిగిన ఘటనలో సీఐని చంపింది  యోగీరాజ్ అని పోలీసులు అనుమానించారు. ప్రస్తుతం పోలీసులకు లభించిన వీడియో ప్రకారం సీఐ సుభోద్ ను కాశ్మీర్ కు చెందిన జీతు ఫ్యూజి అనే జవాను కాల్చిచంపినట్టు తెలుస్తుంది. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యూపీ పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.  బులంద్‌షహర్ హింస తర్వాత వరుసగా బయటకు వచ్చిన వీడియోల్లో జీతు స్పష్టంగా కనిపించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. సుబోధ్ చనిపోయిన సమయంలో జీతు ఆయన ఎదురుగానే ఉన్నట్టు ఓ వీడియోలో కనిపిస్తోంది. అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలు ఇప్పటికే జమ్ముకశ్మీర్ వెళ్లినట్టు తెలిసింది. సుబోధ్‌ హత్య వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates