సీజన్ కదా : భారీగా పెరిగిన బంగారం ధరలు

goldబంగారం కొనుగోళ్లు పెరగడంతో.. ధర కూడా భగ్గుమంది. 10 గ్రాముల బంగారం ధర రూ.32 వేలు టచ్ అయ్యింది. గురువారం ఒక్క రోజే 10 గ్రాములు రూ.300 పెరిగి రూ.32,150కి చేరింది. లోకల్ మార్కెట్లలో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లకు డిమాండ్ రావటంతో ధర పెరిగినట్లు చెబుతున్నారు వ్యాపారులు.

వెండి ధర కూడా కిలో రూ.40వేలకి చేరింది. నాణేల తయారీదారుల నుంచి వెండికి ఆర్డర్స్ పెరగటమే దీనికి కారణం. అమెరికా, దుబాయ్ మార్కెట్లలో బంగారం కొనుగోళ్లు భారీగా పెరగటం విశేషం. దీనికితోడు అక్షయ తృతీయ కూడా కలిసి రావటంతో.. వినియోగదారులను ఆకర్షించేందుకు ఆభరణాల తయారీదారులు భారీ ఆఫర్లను ప్రకటించారు. నెలవారీ పథకాలు, తరుగు తగ్గింపు, వివిధ మోడల్స్‌పై రాయితీ, ముందస్తు నగల రిజర్వేషన్‌ వంటి ఆఫర్లను అందిస్తున్నాయి.

Posted in Uncategorized

Latest Updates