సీతారామ ప్రాజెక్టుకు అనుమతులివ్వండి

edతెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను కోరారు రాష్ట్ర నేతలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి తుమ్మల, ఎంపీలతో కలిసి…కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు. సీతారామ ప్రాజెక్ట్ కు వైల్డ్ లైఫ్ అనుమతులపై కేంద్ర మంత్రిని కోరామన్నారు మంత్రి తుమ్మల. పది లక్షల ఎకరాలకు నీరందించే సీతారామ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి తొలిదశ అటవీ, పర్యావరణ అనుమతులు లభించాయని… వన్యప్రాణులకు సంబంధించిన అనుమతులు రావాల్సి ఉందన్నారు. మరోవైపు పాలమూరు ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులకు క్లీయరెన్స్ పై కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు మంత్రి తుమ్మల.

తెలంగాణలో పాలమూరు ఎత్తిపోతల పథకం, అనంతగిరి రిజర్వాయర్‌ పనులు జరుగుతున్నాయన్నారు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి. ఆ పనులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు.

Posted in Uncategorized

Latest Updates