సీనియర్ ఆర్టిస్ట్ చంద్రమౌళి కన్నుమూత

CHANDRAసీనియర్‌ నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్ చంద్రమౌళి ఏప్రిల్ 5వ తేదీ గురువారం కన్నుమూశారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రమౌళి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. చంద్రమౌళి స్వగ్రామం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మునగలపాలెం.

1971లో అంతా మన మంచికే అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. చంద్రమౌళి తన 45 ఏళ్ల సినీ కెరీర్ లో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషించారు. అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలు పోషించారు. సుమారు 500కి పైగా చిత్రాలు నటించారు. చాలా పాత్రలకు డబ్బింగ్ కూడా చెప్పారు. సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులకు పెద్ద దిక్కుగా కూడా ఉన్నారు చంద్రమౌళి.

 

Posted in Uncategorized

Latest Updates