సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు మృతి

ADIRAJU1969 తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు, రచయిత ఆదిరాజు వెంకటేశ్వరరావు గురువారం రాత్రి 11:30 గంటలకు కన్నుమూశారు. ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్నారు. 1969 ఉద్యమ సమయంలో 21 రోజులు జైలుకెళ్లిన ఏకైక జర్నలిస్టు ఆయన. ఖమ్మం జిల్లా పండితాపురంలో జన్మించాడు ఆదిరాజు వెంకటేశ్వరావు. ఆదిరాజు వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆదిరాజు ఎంతో పోరాడారని గుర్తు చేసుకున్నారు. పత్రిక, సాహితీ రంగానికి ఆదిరాజు విశేష సేవలు అందించారని కొనియాడారు. ఆదిరాజు వెంకటేశ్వరరావు కుటుంబానికి సీఎం కేసీఆర్ సానుభూతి తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates