సీపీఎంను  విడగొట్టవద్దు : సీతారాం ఏచూరి

sitaram-yechuryసీపీఎం పార్టీని విడగొట్టవద్దన్నారు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి. రెండో రోజు హైద‌రాబాద్ లో జరిగిన సీపీఎం జాతీయ మహా సభల్లో ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. గిరి గీసుకుని కూచుంటే పార్టీ, ప్రజలకు నష్టం వాటిల్లుతుందన్నారు. మతోన్మాదమే తమ ప్రధాన శత్రువన్నారు. దాన్ని అడ్డుకోవడాననికి ఇతర లౌకిక పార్టీల మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన కాకుండా రాజకీయ అవగాహన ఉండాలన్నారు. ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వాలని ప్రతినిధులకు ఏచూరి విజ్ఞప్తి చేశారు.

దేశంలో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుపై మహాసభల్లో చర్చిస్తున్నామని చెప్పారు. వేదిక ప్రతిపాదనపై సభలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోందనీ, తీర్మానం శుక్రవారం(ఏప్రిల్-20) మధ్యాహ్నం  తరువాత ఆమోదం తెలపొచ్చన్నారు. జస్టిస్ లోయా కేసును సుప్రీం కోర్టు బెంచ్ ముందు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏచూరి.

 

Posted in Uncategorized

Latest Updates