జనసేన తుది జాబితా.. సీపీఐ నేతలు అసంతృప్తి

సీపీఐకి జనసేన జలక్ ఇచ్చింది.  పార్టీ తరపున పోటీచేసే అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల తుది జాబితాను  జనసేన విడుదల  చేసిన 3 పార్లమెంటు, 19 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖారారు చేసింది. అయితే పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన మంగళగిరి స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ అభ్యర్థిని ప్రకటించారు. దీంతో జనసేన తరఫున చల్లపల్లి శ్రీనివాస్‌ నామినేషన్‌ వేయనున్నారు. సీపీఐ తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా.. చల్లపల్లి శ్రీనివాస్‌ను జనసేన ప్రకటించింది. దీనిపై సీపీఐ నేతలు అసంతృప్తిగా ఉన్నారు.

అసెంబ్లీ అభ్య‌ర్ధుల పేర్లు

న‌ర‌స‌న్న‌పేట –  మెట్ట వైకుంఠం
విజ‌య‌న‌గ‌రం – పాల‌వ‌ల‌స య‌శ‌స్వి
గ‌జ‌ప‌తిన‌గ‌రం – రాజీవ్ కుమార్ త‌ల‌చుట్ల
న‌ర్సీప‌ట్నం –   వేగి దివాక‌ర్
వినుకొండ –   చెన్నా శ్రీనివాస రావు
అద్దంకి –     కంచెర్ల‌ శ్రీకృష్ణ‌
య‌ర్ర‌గొండ‌పాలెం (ఎస్సీ)-   డాక్టర్‌. గౌత‌మ్
కందుకూరు – పులి మ‌ల్లికార్జున రావు
ఆత్మ‌కూరు –  జి. చిన్నారెడ్డి
బ‌న‌గానప‌ల్లి – స‌జ్జ‌ల అర‌వింద్ రాణి
శ్రీశైలం –   స‌జ్జ‌ల సుజ‌ల
ఆలూరు –  ఎస్. వెంక‌ప్ప
పెనుకొండ – పెద్దిరెడ్డిగారి వ‌ర‌ల‌క్ష్మీ
ప‌త్తికొండ – కె. ఎల్ . మూర్తి
ఉర‌వ‌కొండ -సాకే ర‌వికుమార్
శింగ‌న‌మ‌ల (ఎస్సీ)- సాకే ముర‌ళీకృష్ణ
పుట్ట‌ప‌ర్తి – ప‌త్తి చ‌ల‌ప‌తి
చిత్తూరు – ఎన్. ద‌యారామ్
కుప్పం – డాక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ

లోక్ సభ అభ్యర్థులు

హిందూపూర్‌- కరీముల్లా ఖాన్‌

నరసరావుపేట- నయూబ్‌ కమాల్‌

విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్‌

Latest Updates