సీరియల్ కిల్లర్ గావ్ చెంగ్‌యాంగ్‌కు మరణశిక్ష

gaokillerఅత్యంత కిరాతకంగా చైనాలో 11 మంది మహిళలను చంపిన సీరియల్ కిల్లర్ గావ్ చెంగ్‌యాంగ్‌కు మరణశిక్షను విధించింది కోర్టు. 53 ఏళ్ల గావ్ ముందుగా మహిళలను రేప్ చేసి ఆ తర్వాత వాళ్లను హత్య చేసేవాడు. ఆ తర్వాత ఆ శరీరాలను అత్యంత దారుణంగా ముక్కలు ముక్కలు చేసేవాడు. ఆ కిరాతకుడికి గాన్సూ ప్రావిన్సులోని బయ్యన్ సిటీ కోర్టు ఇవాళ మరణ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. దొంగతనంతో పాటు వాంఛిత హత్యలు చేసిన గావ్‌కు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది కోర్టు. ఎర్రటి దుస్తులను ధరించిన మహిళలను మాత్రమే టార్గెట్ చేసేవాడు గావ్. వాళ్లను ఇంటి వరకు ఫాలో చేస్తూ, ఆ తర్వాత ఆ బాధితుల గొంతులను కోసేసి, శరీరాలను ముక్కలు ముక్కలుగా చేసేవాడు. ఎనిమిదేళ్ల బాలికను కూడా అతి హేయంగా చంపేశాడు ఆ క్రూరుడు. కొందరు బాధితులకు ప్రత్యుత్పత్తి అంగాలను కూడా తీసేశాడు. 2016లో గావ్‌ను అరెస్టు చేశారు పోలీసులు.

 

Posted in Uncategorized

Latest Updates