సీసీ కెమెరాలే పాపను కాపాడాయి : సీపీ

CHILDహైదరాబాద్, కోఠీ హస్పిటల్ చిన్నారి మిస్సింగ్ ఘటనలో సీసీ కెమెరాలు ఎంతో ఉంతో ఉపయోగపడ్డాయని తెలిపారు పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. టెక్నాలజీతో నేరస్తులను క్షణాల్లో పట్టుకుంటున్నామని వివరించారు. చిన్నారినీ తల్లి వద్దకి చేర్చిన సందర్భంగా గురువారం (జూలై-5) మీడియాతో మాట్లాడారు సీపీ.

పసికందను క్షేమంగా తల్లి ఒడికి చేర్చామని తెలిపిన అంజనీ కుమార్.. పసికందును ఎత్తుకెళ్లిన విషయం గంటన్నర ఆలస్యంగా పోలీసుల దృష్టికి వచ్చిందని.. అయినప్పటికీ వేగంగా స్పందించి నిందితురాలి ఆచూకీ కనుక్కోగలిగామని తెలిపారు. నిందితురాలు బీదర్ వెళ్లిన విషయాన్ని తెలుసుకొని.. స్థానిక పోలీసుల సహకారంతో ప్రతి ఇళ్లు గాలించడంతో నిందితురాలు భయాందోళనకు గురై శిశువు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వదిలివెళ్లినట్లు వివరించారు. రెండుసార్లు గర్భస్రావం కావడంతో పిల్లలు పుట్టే అవకాశం లేదేమోనని బీదర్ కు చెందిన నైనా ఈ ఘటనకు పాల్పడినట్లు  తెలిపారు సీపీ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతకు సంబంధించి వైద్యశాఖ ఉన్నతాధికారులకు సూచనలు చేశామని చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి ఘటనలు నిరోధించవచ్చని తెలిపారు. నిందితురాలు నైనారాణిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

 

 

Posted in Uncategorized

Latest Updates