సునామీ వార్నింగ్ : ఇండోనేషియాలో భూకంపం

bhookampamఇండోనేషియాలో ఈ ఉదయం భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.4గా నమోదైంది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. బాండా సముద్ర ప్రాంతంలో భూ ఉపరితలం నుంచి 171 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. సునామీ హెచ్చరికను హిందూ మహా సముద్రం సునామీ వార్నింగ్‌ అండ్‌ మిటిగేషన్‌ సిస్టమ్‌(ఐఓటీడబ్లుఎంఎస్‌) జారీ చేసింది.
రెండో బులెటిన్‌లో ఈ సునామీతో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అంబన్‌ ఐలాండ్‌కు 380 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చినట్లు తెలిపారు స్థానిక అధికారులు. ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టం లేదు. భూకంపం 2 నుంచి 3 సెకన్లు ఉంది. ఇదే ప్రాంతంలో గత నెల 26న 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు కూడా ఎలాంటి నష్టం జరగలేదు. ఇండోనేషియా పసిఫిక్‌ రింగ్‌పై ఉందని, అందువల్లే తరచూ భూకంపాలు వస్తున్నాయని తెలిపారు. 2004లో 9.3 తీవ్రతతో సునామీ రావటంతో.. ప్రపంచవ్యాప్తంగా 2.2 లక్షల మంది చనిపోయారు. అప్పుడు ఒక్క ఇండోనేషియాలోనే 1.68 లక్షల మంది చనిపోయారు.

Posted in Uncategorized

Latest Updates