సుప్రీంలో ఊరట : ప్రియాపై కేసులు పెట్టొద్దు

priyaకేరళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రియా ప్రకాష్ నటించిన ఒరు అదుర్‌ లవ్‌ సినిమాలో పాటపై ఇవాళ (బుధవారం, ఫిబ్రవరి-21) కోర్టు విచారణ చేసింది. తనపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని ప్రియా కోర్టును ఆశ్రయించింది. తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నమోదైన కేసులపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నటి, దర్శకుడిపై దేశవ్యాప్తంగా ఎక్కడా క్రిమినల్ కేసులు నమోదు చేయవద్దని కోర్టు ఆదేశించింది.

మాణిక్య మలరాయ పూవీ అంటూ సాగే ఈ మాట తమ మనోభావాలను దెబ్బతీస్తోందని ముస్లిం సంఘాలు కేసులు నమోదు చేస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇప్పటికే స్పందించింది. కేరళ రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ముస్లింలు ఎన్నో సంవత్సరాలుగా ఈ పాటను పాడుతూ వస్తున్నారని వివరణ ఇస్తోంది. రెండు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.

 

Posted in Uncategorized

Latest Updates