సుప్రీంలో కేంద్రం అఫడవిట్ : విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదు

ఏపీలోని విశాఖకు రైల్వేజోన్‌ ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సృష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టంపై శనివారం సుప్రీంకోర్టులో కొత్త అఫడవిట్ దాఖలు చేసింది కేంద్రం. మార్చి 12న జరిగిన రైల్వే శాఖ అధికారుల సమీక్ష సమావేశంలోనే ఈ విషయం చెప్పినట్లు ఆ అఫడవిట్ లో హోంశాఖ తెలిపింది. విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌ లో ఉన్న సంస్థల ఆస్తులను పంచాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త మెట్రో విధానానికి తగినవిధంగా ఉంటేనే విజయవాడలో మెట్రోకు ఆమోదం తెలుపుతామని హోంశాఖ తెలిపింది. వివిధ శాఖలకు సంబంధించిన 753 మంది ఉద్యోగుల విభజన ఇంకా పెండింగ్‌ లోనే ఉందని తెలిపింది. పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే పలు అంశాల పరిష్కారంలో ఆలస్యం జరుగుతుందని అఫిడవిట్‌ లో తెలిపింది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates