లైవ్ లో కోర్టు వాదనలు.. సుప్రీం గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ : కోర్టుల్లో జరిగే వాదనలు ఇకనుంచి టీవీల్లో లైవ్ లో చూడొచ్చు. కోర్టు వాదనల ప్రత్యక్ష ప్రసారానికి ఇవాళ (సెప్టెంబర్-26) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్ట్. ఈ ప్రక్రియ సుప్రీంకోర్టు నుంచే మొదలవుతుందని చెప్పింది అత్యున్నత న్యాయస్థానం. కోర్టు వాదనలు, తీర్పులు లైవ్ లో ఇచ్చేందుకు రూల్స్ ఫాలో కావాలని సూచింది.

లైవ్ ప్రొసీడింగ్స్ ఎలా జరగాలో జనానికి తెలియాలని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. కోర్టు రూమ్‌ లో నుంచి వాదనలను లైవ్‌ లో ఇవ్వడం వల్ల న్యాయవ్యవస్థలోని జవాబుదారీతనం మరింత పెరుగుతుందని చెప్పింది న్యాయస్థానం

సూర్యరష్మే ఉత్తమ క్రిమి సంహారిని అని ఈ సందర్భంగా కోర్టు చెప్పింది. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయో..అలాగే కోర్టు వాదనలు లైవ్ స్ట్రీమింగ్ లో చూస్తే తప్పేమీలేదని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు కోర్టులపై మరింత విశ్వాసం పెరుగుతోందని చెప్పింది సుప్రీం. మేజర్ ఇష్యూస్ అయితే లైవ్ స్ట్రీమ్ ఇవ్వడం..హైకోర్ట్, సుప్రీంకోర్ట్ వాదనలకు ఎక్కువ ప్రధాన్యం ఉంటుందని వెల్లడించింది.

 

Posted in Uncategorized

Latest Updates