సుప్రీం తీర్పు చారిత్రాత్మకం : సంఘ్వీ

SANGVIసుప్రీంకోర్టు ఓ చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు కాంగ్రెస్ తరపు లాయర్ అభిషేక్ సంఘ్వీ.  ప్రొటెం స్పీకర్ ద్వారా  ప్లోర్ టెస్ట్ నిర్వాహించాలని సుప్రీం తీర్పు ఇచ్చిందన్నారు.  బల పరీక్ష అయ్యేంత వరకు కీలక నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీం ఆదేశాలు జారీ చేసిందన్నారు. బల పరీక్షలో నీళ్లకు నీళ్లు..పాలకు పాలు తేలనున్నాయన్నారు. శనివారం (మే-19) సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది సుప్రీం. అందుకుతగ్గట్టుగా భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా.. ఆ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.

రేపు ఎట్టిపరిస్థితుల్లోనూ బలపరీక్ష పూర్తిచేయాల్సిందేనని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది.  ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ బీజేపీని ఆహ్వానించడంపై కాంగ్రెస్-జేడీఎస్‌ లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం అర్థరాత్రి అత్యవసరంగా పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన సుప్రీం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై స్టే విధించలేమని పేర్కొంటూ.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Posted in Uncategorized

Latest Updates