సుప్రీం వ్యాఖ్యలు : ఆధార్ డేటా లీక్ అయితే ప్రజాస్వామ్యం బతికే ఉండదు

adharఆధార్ డేటా లీక్ వ్యవహారం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాముందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫేస్ బుక్ డేటాను అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అక్రమంగా ఉపయోగించుకుని లబ్ధిపొందారని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సమయంలో.. గత వారం 130 కోట్ల మంది భారతీయుల ఆధార్ డేటా లీక్ అయ్యే అవకాశముందని సుప్రీం అభిప్రామపడింది. ఈ విషయంపై స్పందించిన UIDAI ఆధార్ డేటా ఆటమ్ బాంబ్ కాదని తెలిపారు.

ఆధార్ వ్యాలిడిటీపై దాఖలైన 27 పిటీషన్లపై విచారించిన ఐదుగురు జడ్జిల ధర్మాసనం.. ఆధార్ డేటా లీక్ అయ్యి.. ఎన్నికల ఫలితాల్లో దాని ప్రభావం ఉంటే ప్రజాస్వామ్యం బతికే వీలుండదని తెలిపింది. ఆదార్ కార్డుని అన్నింటికీ లింక్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఈ విధమైన కామెంట్లు చేసింది.

Posted in Uncategorized

Latest Updates