సుష్మాస్వరాజ్ జోక్యంతో….ఆ దంపతులకు పాస్ పోర్ట్

SUSపాస్ పోర్ట్ విషయంలో అధికారితో అవమానించబడ్డ దంపతులకు ….ఫైనల్ గా పాస్ పోర్ట్ ఇష్యూ అయింది. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కలుగజేసుకోవడంతో… మతాంతర వివాహం చేసుకున్న ఆ జంటకు… పాస్ పోర్ట్ వచ్చింది. నోయిడాకు చెందిన తన్వి సేఠ్ … ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పాస్ పోర్ట్ కోసం ఆమె ఆఫీస్ కు వెళ్లగా అక్కడున్న అధికారి… దంపతుల్లో ఎవరో ఒకరు పేరు మార్చుకోవాలని సూచించాడట. దీనిపై తన్వీ సేఠ్ ట్విట్టర్ లో సుష్మా స్వరాజ్ కు కంప్లైంట్ చేసింది. తమ ఇద్దరి పాస్ పోర్ట్ ని హోల్డ్ లో పెట్టాడని… సాయం చేయాలని సుష్మాను కోరింది. దీనిపై అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు సుష్మాస్వరాజ్. ఆ అధికారిని ట్రాన్స్ ఫర్ చేశారు. ఇవాళ తన్వీ సేఠ్ దంపతులకు కొత్త పాస్ పోర్ట్స్ కూడా అందించారు

Posted in Uncategorized

Latest Updates