సూపర్బ్ చిట్టితల్లీ : అమ్మమ్మ ఇంట్లో చిన్నారి కొబ్బరి చెట్టు విన్యాసాలు

schoolఎండాకాలం వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో అన్నీ స్కూల్స్ కి సెలవులు ఇవ్వనున్నారు. మరి రెండు నెలల ఎండాకాలం సెలవు రోజుల్లో ఏం చేయాలి దేవుడా అని ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

సమ్మర్ హాలిడేస్ లో చిన్న పిల్లలు సాధారంగా తమ బంధువుల ఇళ్లకి వెళతారు. ఆ సమయంలో తమ ఆటపాటలకు హద్దు ఉండదు. అలానే కేరళలోని ఓ చిన్నారి స్కూల్ కి ఎండాకాలం సెలవులు ఇవ్వడంతో తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్కడ ఆ చిన్నారి తనకు గొప్ప ఫ్రీడమ్ దొరికినట్లుగా భావించింది. దీంతో ఇంటి ఆవరణలో ఉన్న ఓ కొబ్బరి చెట్టను పాకుతూ ఎక్కి అందరినీ ఆశ్యర్యపరిచింది. ఈ వీడియోను ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా ఇప్పటి వరకూ 73 వేల షేర్లతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏ మాత్రం భయం లేకుండా, బెరుకు లేకుండా.. కొబ్బరి చెట్టు మట్ట పట్టుకుని చకచకా పైకి ఎక్కటం.. అక్కడి నుంచి జర్రున కింద జారటం ఇలా ఆ చిన్నారి చేస్తున్న ఎంజాయ్ అందరికీ ముచ్చటగా అనిపించింది. కొందరికి చిన్నప్పటి జ్ణాపకాలు గుర్తుకొచ్చాయి. మరికొందరు అయితే నగరాల్లోకి వచ్చి.. ఇలాంటి ఆనందాలను ఎన్నో మిస్ అయ్యాం అని ఫీలయ్యారు.

Posted in Uncategorized

Latest Updates