సూపర్ ఐడియా : సిటీ పోలీసుల సైకిల్ పెట్రోలింగ్

హైదరాబాద్ పోలీసుల కోసం కొత్తగా స్ట్రీట్ బైస్కిల్ పెట్రోలింగ్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చింది తెలంగాణ హోంశాఖ. బస్తీల్లో డ్యూటీ చేసే కిందిస్థాయి పోలీసుల కోసం ఈ బైస్కిల్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు. సైకిల్‌ కు ఫస్ట్ ఎయిడ్ కిట్ బాక్స్, కమ్యూనికేషన్ అందిండానికి మాన్పాక్ట్, GPS సిస్టమ్, లాఠీ, ఒక వాటర్ బాటిల్ ఉంటాయి. సమర్థవంతంగా కమ్యునిటీ పోలిసింగ్, నేరాలను అరికట్టడం, మారుమూల ప్రదేశాల్లోకి కూడా సులువుగా చేరుకొని అక్కడ పౌరసేవలు అందించటమే లక్ష్యంగా స్ట్రీట్ పెట్రోలింగ్‌ ను అందుబాటులోకి తెచ్చారు. స్ట్రీట్ లోకి పోలీస్ కార్లు వెళ్లనిచోట..ఈ సైకిల్స్ ఎంతో ఉపయోగపడుతాయి.

అంతే కాకుండా పొల్యూషన్ లేకుండా ఉంటుందని, పోలీసులకు సైకిల్ తొక్కడంతో చక్కటి వ్యాయమం చేసినట్టు ఉంటుందనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది పోలీస్ శాఖ. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు గల్లీల్లో రౌండ్స్ వేయాలని సూచించింది. దీనిద్వారా స్ట్రీట్ రౌడీలను గుర్తించే వీలు ఉంటుంది.

గల్లీల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని, పోలీసులు రౌండ్స్ వేస్తున్నారంటే దొంగలకు భయం ఉంటుంది. స్ట్రీట్స్ లో సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో లాంటి వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. సైక్లింగ్ రౌండ్స్ తో సామాన్య ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు తెలిపింది తెలంగాణ పోలీసింగ్ శాఖ.

Posted in Uncategorized

Latest Updates